వెబ్ న్యూస్, బతుకమ్మ : జాతుల మధ్య హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత మణిపూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు న్నాయని చెప్పారు. మిజోరం నుంచి చురాచంద్ పూర్ చేరుకున్న మోదీ నిరాశ్రయులతో మాట్లాడారు. మణిపూర్ ప్రజలారా.. మా వెంట నేనున్నా అని భరోసా నిచ్చారు. రాష్ట్రంలో 7 వేల కొత్త ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మణిపూర్ ప్రజల మేలు కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈపర్యటనలో భాగం మోదీ రూ. 8.500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు.

