- తహసీల్దార్ వేణుగోపాల్
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని తహ సిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పిస్తే తమ పరిధిలో ఉన్న ఫిర్యాదులను ఇక్కడికి ఇక్కడే పరిష్కరిస్తామని ,తమ పరిధికి మించిన దరఖాస్తులు ఉంటే వాటిని జిల్లా స్థాయి అధికారులకు పంపించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు . సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఎలాంటి దరఖాస్తులు రాలేవని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కమలాకర్ ఎంపీ ఓ యాదగిరి హాస్టల్ వార్డెన్లు శాంతి, వీణ, సీనియర్ అసిస్టెంట్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
