24 C
Hyderabad
Sunday, August 2, 2026

టిసిఎస్ కేసులో నిదా ఖాన్ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టిసిఎస్ లో మత మార్పిడులు, లైంగిక వేధింపుల కేసులో టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాసిక్ టీసీఎస్ యూనిట్ లో  ఉద్యోగిగా పనిచేసిన నిదా ఖాన్  మతమార్పిడిలు, లైంగిక దాడులు ప్రోత్సహించారని ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 25 రోజులుగా పరారీలో ఉన్న నిదా ఖాన్ ను  చత్రపతి సాంబాజీ నగర్ లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ టిసిఎస్ బిపి ఓలో టెలికాలర్ విభాగంలో నిదా ఖాన్ పనిచేస్తు అత్యాచార నిందితులకు అండగా ఉండేదని, ఉద్యోగులపై ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకుంటూ మత మార్పిడిలు ప్రోత్సహించింది అని ప్రధాన అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం విదితమే.మహిళ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు కాగా పరారీలో ఉంటునే నిదా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నాసిక్ కోర్టు ముందస్తు బెయిల్  తిరస్కరించగా పరారీలో ఉన్న నిదా ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

More articles

Latest article