టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన పీఆర్ టీయూ నూతన కార్యవర్గం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల నూతనంగా ఎన్నికైన పీఆర్ టీయూ జిల్లా నూతన కార్యవర్గం టీపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పిఆర్టీయూ నూతన జిల్లా అధ్యక్షులు అంబెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్ లు మహేష్ కుమార్ గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.. అనంతరం వారు మహేష్ కుమార్ గౌడ్ తో పలు సమస్యలను విన్నవించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్వ...