హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి లో బిసి ఎస్సి ఎస్టీ జాక్ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిధి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు, నిజామాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కన్వీనర్ తాళ్ళ రాంపూర్ కి చెందిన రామా గౌడ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారి కోసం ప్రతి ఒక్కరు మహానుభావుల చరిత్రను తెలుసుకొని రాజ్యాధికార సాధన కోసం ముందరకు రావాలని దీనితో బీసీ ఎస్సీ ఎస్టీల జీవితాలు వారి పిల్లల భవిష్యత్తు బంగారంలా మారుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డా. విశారదన్ మహారాజ్, బాలరాజు గౌడ్ ,మానాల కిషన్, నిజామాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ కన్వీనర్ రామాగౌడ్,చందా మల్లయ్య,అయిలి వెంకన్న గౌడ్, దుర్గం మల్లయ్య గౌడ్,వేముల కొండల్ గౌడ్, అవ్వారి వేణుకుమార్, బైరి శేఖర్ గంగపుత్ర,దాసోజు లలిత, రాఘవేంద్ర ముదిరాజ్, రాసాల వినోద్ యాదవ్,రాము యాదవ్, కార్తీక్ ఏకలవ్య,సుదర్శన్, తదితరులు,పాల్గొన్నారు.