కల్దుర్కి గ్రామంలో నేతాజీ జయంతి వేడుకలు

బోధన్, బతుకమ్మ :   కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేతాజీని స్మరించుకుంటూ వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు, జయంతే కాని వర్ధంతి లేని అమరుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రలేకుండా చేసిన వీరుడు అని కొనియాడారు. స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్...