29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజా పాలన కార్యక్రమంలో ఎన్ సిసి విద్యార్థుల పరిశుభ్రత కార్యక్రమాలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు, ఎన్ సిసి క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం, సోమవారం, మంగళవారం కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిసర ప్రదేశాలను శుభ్రపరిచారు. ప్రత్యేకించి చేపట్టిన ఈ కార్యక్రమంలో కళాశాల పరిశుభ్రమైన తీరుగా మారిపోయిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రెడ్డి విద్యార్థులను, క్యాడేట్లను అభినందించారు. ఎప్పుడు కళాశాలను బాధ్యతగా శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం,  ఎన్ సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వామి, వీఆర్వో దండు స్వామి, వివిధ విభాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ సిసి క్యాడేట్లు తదితరులు పాల్గొన్నారు.

 

NCC students' cleanliness drive during public governance program

More articles

Latest article