నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు, ఎన్ సిసి క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం, సోమవారం, మంగళవారం కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిసర ప్రదేశాలను శుభ్రపరిచారు. ప్రత్యేకించి చేపట్టిన ఈ కార్యక్రమంలో కళాశాల పరిశుభ్రమైన తీరుగా మారిపోయిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రెడ్డి విద్యార్థులను, క్యాడేట్లను అభినందించారు. ఎప్పుడు కళాశాలను బాధ్యతగా శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, ఎన్ సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వామి, వీఆర్వో దండు స్వామి, వివిధ విభాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ సిసి క్యాడేట్లు తదితరులు పాల్గొన్నారు.
