29.2 C
Hyderabad

ఇద్దరు ఐపీఎస్ లకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష

Two-week simple imprisonment for two IPS officers

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు

 హైదరాబాద్, బతుకమ్మ:

సివిల్ వివాదల్లో పోలిసులు తలదూర్చవద్ధని జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన ఇద్దరు ఐపీఎస్ లకు హైకోర్టు రెండు వారాల సాధారణ జైలు శిక్ష తో పాటు  ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఇద్దరు ఐపిఎస్ అధికారులకు  గురువారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అప్పీల్ కు వీలుగా శిక్ష అమలు వారం పాటు నిలిపివేస్తు సంచలన తీర్పు వెలువరించింది.

Two-week simple imprisonment for two IPS officers

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 6 ఎకరాల భూమి విషయంలో ఓ వ్యాపారికి, ఒ వ్యక్తి మద్య సివిల్ వివాదం నడుస్తోంది. సదరు భూమిపై పిటిషనర్ కు జిల్లా కోర్టులో మధ్యంతర ఇంజక్షన్ ఉత్తర్వులు ఉండటంతో, సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవద్ధంటు హైకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ హైకోర్టులో కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని వారిపై చర్యలు రద్దు చేశారు. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఒక అధికారి, డిసీపీ స్థాయి అధికారులను దోషులుగా నిర్ధారించి ఇద్దరికీ రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం రోజులు కారాగార వాసం అనుభవించాలని తీర్పు చెప్పారు. అయితే ఈ తీర్పు ను డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వీలుగా జైలు శిక్ష అమలు ను వారం రోజుల పాటు తాత్కలికంగా  నిలిపివేస్తు ఉత్తర్వులు ఇవ్వడం కోసమెరుపు.

More articles

Latest article