23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ డాన్స్ మాస్టర్ వినయ్‌కు ‘నాట్య రత్న’ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వీసీ స్టెప్స్ అకాడమీ చిన్నారులకు ‘బెస్ట్ ఫోక్ డాన్స్ పెర్ఫార్మెన్స్’ పురస్కారం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలుగు కళాకార్ టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, కోటిలో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘నాట్యం’ సాంస్కృతిక కార్యక్రమంలో నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ వినయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక ‘నాట్య రత్న’ అవార్డు లభించింది. నృత్యరంగ అభివృద్ధికి, యువత, చిన్నారుల్లో నృత్యకళ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి నిర్వాహకులు ఈ అవార్డుతో ఘనంగా సత్కరించారు. అవార్డు అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని, ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని వినయ్ కుమార్ తెలిపారు. అదే కార్యక్రమంలో వినయ్ ఆధ్వర్యంలోని వీసీ స్టెప్స్ డాన్స్ & ఫిట్నెస్ అకాడమీకి చెందిన చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వారి సమన్వయం, హావభావాలు, వేషధారణ, వేదికపై ప్రదర్శించిన ప్రతిభకు న్యాయనిర్ణేతలు, అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అకాడమీ చిన్నారులకు ‘బెస్ట్ ఫోక్ డాన్స్ పెర్ఫార్మెన్స్’ అవార్డు ప్రదానం చేశారు. తేలి కామాఖ్య, ఆలియా తబస్సుం, శరణ్య నక్షత్ర, గైని లాస్య, అమ్గోత్ లు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విజయం తమ అకాడమీ విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, గురువుల అంకితభావానికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన కళాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ ఎస్.కె. సిరాజ్ కు వినయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు కొత్త తరానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కళాకారులు, నృత్య గురువులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు, తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొని విజేతలను అభినందించారు. కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ ‘నాట్యం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

More articles

Latest article