24.1 C
Hyderabad
Monday, August 3, 2026

భూమి సారాన్ని కాపాడుకోవడానికి సహజ వ్యవసాయం ఎంతో కీలకం

Must read

📰 Generate e-Paper Clip

 

నవీపేట్, బతుకమ్మ :

 

ప్రస్తుత జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు భూమి సారాన్ని కాపాడుకోవడానికి సహజ వ్యవసాయం ఎంతో కీలకమని గ్రామ సర్పంచ్ అర్మూర్ లావణ్య అన్నారు. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో బుధవాంర సహజ వ్యవసాయం (నేచురల్ ఫార్మింగ్) ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) కింద నమోదు చేసుకున్న రైతులకు మట్టి ఆరోగ్య కార్డులు (సోషల్ హేల్త్ కార్డులు) పంపిణీ చేశారు. అదే విధంగా జూట్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్నులు, క్యాలెండర్లు, క్యాప్స్ వంటి ఉపకరణాలను కూడా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నర్సింగ్ రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) వసంత్, మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) నవీన్ కుమార్, రిసోర్స్ పర్సన్ రవీందర్, మాజి యంపి.టిసి లక్ష్మణ్, యువ రైతులు చిన్నదోడ్డి ప్రవిణ్, గణేష్, సంజీవ్, సంపత్, పోతన్న, కిషాన్, లింగారెడ్డి, శ్రీకాంత్, నవిన్, పోతన్న, రాజు, ప్రవిణ్, దశరథ్, బోజారం ఎన్ఎంఎన్ఎఫ్ లో నమోదు చేసుకున్న రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో సహజ వ్యవసాయం పట్ల అవగాహన పెరిగి, భవిష్యత్తులో మరింత మంది రైతులు ఈ విధానాన్ని అనుసరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

More articles

Latest article