28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులందరు కూడా బాగా చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

లింగం పేట్, బతుకమ్మ :

 

నూతన విద్యా విధానానికి అనుకూలంగా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని లింగంపేట్ మండల విద్యాశాఖ అధికారి వంచ అంజల్ రెడ్డి అన్నారు. ఎంపియుపిఎస్ సజ్జన్ పల్లి పాఠశాలను బుధవారం విద్యాశాఖ అధికారి అకస్మాత్తుగా సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి రుచి చూశారు. పాఠశాల నిర్వహణ తీరుపైన సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి స్వయం పాలన దినోత్సవం కార్యక్రమంలో ప్రసంగించారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించినటువంటి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మొదటిసారిగా పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారిని ఉపాధ్యాయ బృందం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఉపాధ్యాయులు సత్యనారాయణ, రవి, ప్రతిమ, సమత, రాజు, పర్వయ్య లు పాల్గొన్నారు.

More articles

Latest article