- బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ వేణుగోపాల్ సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేయబడుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ ఎఫ్ బీ ఎస్) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి,59 ఏళ్లలోపు ఉండాలని అన్నారు. అర్హులైన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు తాసిల్దార్ సూచించారు.
“జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కోసం కావలసిన పత్రాలు”
1) దరఖాస్తు
2) కుటుంబ సభ్యుల ధ్రువ పత్రము
3) ఆహార భద్రతా కార్డ్
4) కుల మరియు ఆదాయ ధ్రువ పత్రములు
5) లబ్దిదారుని ఆదార్ కార్డు
6) మరణించిన వ్యక్తి ఆదార్ కార్డ్ మరియు మరణ ధ్రువ పత్రము
7) బ్యాంకు పాస్ బుక్
8) మరణించిన వ్యక్తి 12.04.2017కన్నా ముందు మరనిచ కూడదు ఒకవేళ మరణించినట్లయితే లబ్దిదారునికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తించదు..
9) మండల సమాఖ్య కార్యాలయము నుండి NOC ధ్రువ పత్రము
10 లబ్దిదారుని చర వాణి సంఖ్య
