బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలో ఉన్న బ్యాంకుల మేనేజర్లతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ ఏటీఎం భద్రతతో పాటు బ్యాంకు ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా బ్యాంకు ముందు బ్యాంకు లోపల మంచి సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏటీఎం దగ్గర బ్యాంకులో నైట్ సెక్యూరిటీ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్ ఎస్సై ఆంజనేయులు బిబీపెట్ ఎస్సై ప్రభాకర్ దోమకొండ ఎస్సై స్రవంతి వివిధ బ్యాంకు మేనేజర్ పాల్గొన్నారు.
