31.8 C
Hyderabad

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష

Husband sentenced to five years of rigorous imprisonment in wife's suicide case

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

భార్య ఆత్మహత్య చెసుకోవడానికి కారకుడైన భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పిపి తెలిపిన వివరాలు ప్రకారం ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన వేముల సాయిలు డిచ్పల్లి గ్రామ వాస్తవ్యురాలు మనోజ కు 2016 వ సంవత్సరంలో వివాహం జరిగింది. పెళ్ళిలో ఎలాంటి నగదు వరకట్నం లేకుండా పెళ్లి నిర్వహించుకున్నారు. కొన్నాళ్ళకు నగదు వరకట్నం కావాలని సాయిలు భార్య మనోజ ను మానసిక, శరీరక చిత్రహింసలకు గురి చేసేవాడు. “భార్యను ఉద్దేశించి నువ్వు చనిపోతే నేను మరొక పెళ్లి చేసుకుంటే నగదు కట్నం డబ్బులు వస్తాయని భాధలకు, హింసకు గురి చేసేవాడు.భర్త పెట్టె చిత్రహింసలు భరించలేని ఆమె చంద్రాయన్ పల్లి గ్రామ శివారులోని పెద్ద పోషవ్వ గుడి దగ్గర వేప చెట్టుకు 2024 అక్టోబర్, 13 న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.” డిచ్పల్లి సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కోర్టులో దాఖలు చేసిన చార్జీషీట్ అదారంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ, ధ్రువీకరించుకున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసిన అనంతరం ముద్దాయి వేముల సాయిలుపై నేర నిరూపణ అయినట్లు నిర్దారిస్తు తీర్పు వెలువరించారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 85 వరకట్న వేధింపులకు గాను మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైనందున సెక్షన్ 108 ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయి రూపాయల జరిమానా విదిస్తూ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు చెప్పారు.

More articles

Latest article