అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజనా పథకం వర్తింపు

బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్   బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని  తాసిల్దార్ వేణుగోపాల్ సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేయబడుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ ఎఫ్ బీ ఎస్) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు...