28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగానికి సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాలుపంచుకుంటూ, రక్తదాన శిబిరాలు, థాలసీమియా రోగుల చికిత్స, ఆరోగ్య శిబిరాల్లో సహకరించిన వైద్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ “డాక్టర్లు తమ వైద్య సేవలతో పాటు సమాజానికి నిస్వార్థంగా సేవలందించడంలో రెడ్ క్రాస్‌కు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. వీరి సేవలను గుర్తించి సత్కరించడం గర్వకారణం” అని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు, అత్యవసర సేవల సందర్భాల్లో నిరంతరం అందుబాటులో ఉంటూ రెడ్ క్రాస్‌తో భాగస్వామ్యంగా ఉన్న డాక్టర్లు డా.టి జీవన్ రావు, డా.టి నాగేశ్వర్ రెడ్డి , డా.జి కౌలయ్య ,డా.రవీంద్రనాథ్ సూరి, డా.విబూది రాజేష్, డా.నీలి రాంచందర్ , డా.సవిత రాణి , డా.బొగ్గుల రాజేష్ , డా.కొట్టూరు శ్రీశైలం ,డా.అశ్విన్ కుమార్ రెడ్డి , డా.జమల్పూర్ రాజశేఖర్ లను ఘనంగా సత్కరించి  పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ , కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు , పోచయ్య , బొద్దుల రామకృష్ణ మరియు బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article