రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగానికి సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాలుపంచుకుంటూ, రక్తదాన శిబిరాలు, థాలసీమియా రోగుల చికిత్స, ఆరోగ్య శిబిరాల్లో సహకరించిన వైద్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ "డాక్టర్లు తమ వైద్య సేవలతో పాటు సమాజానికి నిస్వార్థంగా సేవలందించడంలో రెడ్ క్రాస్‌కు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. వీరి సేవలను...