ఐఐటి అడ్వాన్స్ 2025 ఫలితాలలో నారాయణ నిజామాబాద్ విజయభేరి

0 15,614

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సోమవారం ప్రకటించిన జెఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి ఎం. అజయ్ 842 ర్యాంకు సాధించి జిల్లాలో  మొదటి స్థానంలో  నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. అలాగే కేతావత్ భాస్కర్  2088 జాతీయ స్థాయి ర్యాంకు, పంచమహాల్కర్ రియా ఓపెన్ కేటగిరి లో 5957 ర్యాంక్ సాధించారు. ఇలా పదివేల లోపు 4 ర్యాంకులు , 20వేల లోపు 7 ర్యాంకులతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని తెలిపారు. 2025 జేఈఈ మెయిన్స్ ఫలితాలలోను 99.83 లాంటి జిల్లాలో అత్యధిక పర్సంటేల్ సాధించి వరుసగా రెండవ సంవత్సరం నారాయణ కాలేజ్ విద్యార్థులు విజయ పదంలో నిలిచారని పేర్కొన్నారు.

టీజీ ఎప్ సెట్-2025 లో 319 ర్యాంకుతో నిజామాబాదు జిల్లా మొదటి స్థానం పొందారని, మెడికల్ విభాగంలో గాంధీ మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజీలలో సీట్లు సాధించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో గాండ్ల వరుణ్ 470 మార్కులకు గాను 468 మరియు బైపీసీ విభాగంలో అయేషా ఆఫీఫా 440 మార్కులకు గాను 438 మార్కులు అలాగే సీనియర్ ఇంటర్ లో  అంబటి షర్వాణి 1000 మార్కులకు కాను 993 మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు. ఇలా ఎంపీసీ మరియు బైపీసీ లో కూడా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణం. జెఈఈ,ఎంసెట్,ఐఐటి,నీట్ లాంటి ఏ పోటీపరీక్షలైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో ఎం శేఖర్, నారాయణ విద్యాసంస్థల జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, కోర్ డీన్ వీరాంజనేయ ప్రసాద్ గారు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.