వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో తన సతీమణితో కలిసి పుణ్యస్నానం చేశారు. నిజమైన ఆశీర్వచనం లభించిందంటూ ’ఎక్స్‘ వేదిక గా పోస్టు పెట్టారు. ఈసందర్భంగా తనయుడు నారా దేవాంశ్ తో కలిసి కుంభమేళాలో దిగిన సెల్ఫీని షేర్ చేశారు. 16 ఫిబ్రవరి నాటికి మొత్తంగా 52.83 కోట్లమంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
కుంభమేళాలో కుమారుడితో నారా లోకేశ్ సెల్ఫీ
