-ఉపాధ్యక్షుడుగా ఆవుల నారాయణ రావు
-ఎన్నికల అధికారుల వెల్లడి
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 వార్షిక ఎన్నికల పోలింగ్, ఫలితాలను ఎన్నికల అధికారులు, సీనియర్ న్యాయవాదులు అమిదాల సుదర్శన్, మెట్టు నరేష్ కుమార్ గురువారం వెల్లడించారు.అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది నీలకంఠ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విధితమేనని అన్నారు. ఉపాధ్యాక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవులకు గురువారం పోలింగ్ నిర్వహించగా మొత్తం 411 ఓటర్లకు గాను 331 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆవుల నారాయణ రావుకు 193 ఓట్లు రాగా,వినయ్ కుమార్ కు 136 ఓట్లు వచ్చాయని ఆవుల 57 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారని వారు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన సీనియర్ న్యాయవాది నల్ల సుభాష్ రెడ్డి 95 ఓట్ల ఆధిక్యంతో శీలం భాస్కర్ రెడ్డిపై విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి పదవికి బాలరాజ్ నాయక్, భాస్కర్ రెడ్డి, సుభాష్ రెడ్డి పోటీ చేశారు.

పూర్తిస్తాయి ఆపీస్ బేరర్స్ ఎన్నిక……..
అధ్యక్షుడుగా నీలకంఠ రావు, సంయుక్త కార్యదర్శి మానస, లైబ్రరీ కార్యదర్శి పుణ్యరాజ్, కోశాధికారి మధుసుధన్ గౌడ్,క్రీడలకార్యదర్శి బైర గణేష్,మహిళ ప్రతినిధిగా ఝన్సిరాని ఎన్నికైన విషయం తెలిసిందే. కార్యవర్గం సభ్యులుగా దిలీప్, కవిత తుకారామ్,రవిబాబు, సుదీర్, అనూష, అపూర్వ, జమీల్, ఖాళీడ్, జీషన్ ఎన్నికయ్యారు.
‘బార్’ప్రధాన కార్యదర్శి నేపథ్యం.
నల్ల సుభాష్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీ నుండి లా పట్టభద్రులయ్యారు గత ఇరవై ఏళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బార్ అసోసియేషన్ అధికారిక కార్యక్రమాలలో అధ్యక్షుని తరువాత ప్రధాన కార్యదర్శి పదవే కీలకం.న్యాయవాదులు విగ్నేష్ నరేందర్ రెడ్డి,ఉదయ కృష్ణ, నిషాంత్, బిట్ల రవి, రవి ప్రసాద్,తుకారామ్ శుభాకాంక్షలు తెలిపారు.
