28.8 C
Hyderabad
Monday, August 3, 2026

విలువలే ఆస్తిగా బ్రతికిన వ్యక్తి ముత్యాల మనోహర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: సమాజమే తన కుటుంబంగా బ్రతికి, మంచి మాటలు మాట్లాడుతూ పదిమందికి మంచి చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మనోహర్ రెడ్డి ఆయన విలువలే ఆస్థిగా బ్రతికారని  బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు అంటే మొదటిగా గుర్తొచ్చే పేరు ముత్యాల మనోహర్ రెడ్డి అని పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా తన జీవితకాలం తపస్సును చేసిన వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. ఆయన మన మధ్య లేక సంవత్సర కాలం గడిచిపోయిందని అన్నారు. మనోహర్ రెడ్డి జీవితము నుండి ఈ కాలం యువత ఎన్నో పాఠాలను నేర్చుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా పాలెం గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాలెం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mutyala Manohar Reddy, a man who lived his life as an asset

More articles

Latest article