నిర్మల్, బతుకమ్మ : నిర్మల్ లో నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో లడ్డూ ను ముస్లిం మహిళ దక్కించుకున్నారు. పట్టణంలోని ఈద్గాం ఆదర్శ నగర్ వినాయక లడ్డూ వేలం పాటలో అమ్రీన్ అనే ముస్లిం మహిళ పాల్గొన్నారు. అమ్రీన్ రూ. రూ.1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ముస్లిం మహిళ హిందూ పండుగలో భాగస్వామి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందని అమ్రీన్ తెలిపారు.