24.6 C
Hyderabad

రోడ్డుదాటేక్రమంలో వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలి మృతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రోడ్డు దాటే క్రమంలో టస్కర్ వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి చెందింది. ఈఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గుడి మల్కాపూర్ కు చెందిన రేణుక గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆదివారం ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డును దాటే క్రమంలో బషీర్ బాగ్ నుంచి వస్తున్న టస్కర్ వాహనం రేణుకను ఢీకొంది.  పారిశుధ్య కార్మికులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా .. అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article