. . . ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్య డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్య అన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు రోజు రోజుకి పెరుగుతున్న కార్మికుల బతుకు మాత్రం మారడం లేదని, పూట గడవని పరిస్థితిలో కార్మికులు ఉన్నారని, వారం రోజులు గడుస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు వెయ్యకపోవడం సిగ్గుచేటని ఆయనన్నారు. గ్రూపు వైగా చేస్తేనే వేతనాలు నేస్తామని అధికారులు కార్మికులకు చెప్పడం వల్ల కార్మికుల ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూపులకు సంబంధం లేకుండా ఏజెన్సీలకు సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు వారి అకౌంట్లోనే వేతనాలు వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేని యెడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.
