మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలి

  . . . ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్య డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్య అన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు రోజు రోజుకి పెరుగుతున్న కార్మికుల బతుకు మాత్రం మారడం లేదని, పూట గడవని పరిస్థితిలో కార్మికులు ఉన్నారని, వారం రోజులు గడుస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు వెయ్యకపోవడం సిగ్గుచేటని...