27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :

 

నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో గల వాటర్ ట్యాంక్ ఎక్కి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం నగరంలో సంచలనం రేపింది. నగరపాలక సంస్థ జోన్ – 3 పరిధిలో వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న షేక్ హాజీ సమయానికి వేతనాలు రావడం లేదని నెలరోజులు గడిచిన మార్చి నెల వేతనం రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మైక్ సెట్ ధ్వారా అతనికి నచ్చజెప్పి కిందకు దించారు. దీంతో ఆత్మహత్యాయత్నం కథ సుఖాంతమైంది. వాటర్ ట్యాంక్ దిగిన హాజీ మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు.

More articles

Latest article