ఎల్లారెడ్డి, బతుకమ్మ :
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వివరాలను ఎమ్మెల్యే కి తెలియజేశారు. అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ని విన్నవించారు. అదే విధంగా రాబోయే రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు శంకరయ్య, చంద్రయ్య, గఫార్, సిద్ది శ్రీధర్, గాదె తిరుపతి, ఎరుకల దశరథ్ తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, డాక్టర్ శ్యామ్, ప్రశాంత్ గౌడ్, రఫీక్, పప్పు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
