ముగ్గుల పోటీలు సాంప్రదాయాలకు  ప్రతీకలు

0 1,240

డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీ శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : సంక్రాంతి ముగ్గుల పోటీలు సాంప్రదాయానికి  ప్రతీకాలు అని ఎల్లారెడ్డి డీఎస్పీ  శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  కురుమ సాయిబాబా  తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో మండలంలోని జీవదాన్ హైస్కూల్లో  నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలుగుదనం ఉట్టిపడేలా  సాంప్రదాయాలను గౌరవిస్తూ  అందమైన ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించారన్నారు. తెలుగు సంస్కృతిని ఉట్టిపడేలా  భోగి మంటలు, గొబ్బెమ్మలు, హరిదాసు, పలు అందమైన చిత్రాలు వంటి రంగవల్లులు  తీర్చిదిద్దారన్నారు. మహిళలు, విద్యార్థినీలు ఆకర్షణీయంగా  సందేశాత్మకమైన  ముగ్గులు వేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. కురుమ సాయిబాబా తన తల్లిదండ్రుల  జ్ఞాపకార్థంతో  ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని కొనియాడారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ… ఈ ముగ్గుల పోటీలకు  ఎల్లారెడ్డి పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుంచి  మహిళలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులు వేసి రంగులను సాంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ముగ్గుల పట్ల మక్కువ చూపుతున్న మహిళలకు అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో ముగ్గుల పోటీలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మహిళలకు  ఉత్సాహం పరిచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సహకారాన్ని అందించడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ పోటీలో మొదటి బహుమతి నవనీత, రెండవ బహుమతి మౌనిక, మూడవ బహుమతి అక్షయ, నాలుగవ బహుమతి స్వప్న, ఐదవ బహుమతి మౌనికలను బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య విచ్చేసినటువంటి  ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా శాలువులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, మున్సిపల్ కౌన్సిలర్ నీలకంఠం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  అరుణ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, డైరెక్టర్లు  సుఖేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాం రెడ్డి, నాగేష్, నాయకులు విద్యాసాగర్, గోవింద్, నాగం శ్రీనివాస్, సిద్దు,గణేష్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.