29.8 C
Hyderabad

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

మోపాల్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు మోపాల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహంచారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథితులుగ జిల్లా ఇంచార్జీ ఇరుగు పైడి మాదిగ, మోపాల్ మండల ఇంచార్జీ రొడ్డ ప్రవీణ్ మాదిగలు హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై సంవత్సరాలు పోరాడి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామన్నారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ల పెరగాలని ఉద్యమాన్ని చేసి వారికి రూ.2వేలు, గుండె జబ్బుల పిల్లలు కోసం పోరాడితే ఆరోగ్య శ్రీ పథకం వచ్చిందన్నారు. 30 సంవత్సరాలుగ సమాజం ఉద్యమానికి అండగ నిలబడిందని గుర్తు చేశారు. రేపటి తరాలకోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమంలో సమాజం అండగ నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీలు, కులపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

MRPS Foundation Day Celebrations in a Grand Manner

More articles

Latest article