.👉 విద్యుత్ శాఖ ఎస్ఈ కి నోటీస్ అందజేసిన జేఏసీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ కు ఇచ్చిన పిలుపుమేరకు జాతీయస్థాయి విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా జూలై 9న విధుల బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా టీ జాక్ సమావేశంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనిర్ణయం తీసుకున్నారు. విద్యుత్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కరోజు విధులను బహిష్కరించి జిల్లా పవర్ హౌస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు. నిజామాబాద్ ,ఎంఆర్టి, డిచ్పల్లి సెంట్రల్ ఆఫీస్ డివిజన్లో విద్యుత్ ఉద్యోగులు& ఇంజినీర్లు నిజామాబాద్ పవర్ హౌస్ ముందు, బోధన్& ఆర్మూర్ డివిజన్లో విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు ముందు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటీసును ఎస్ ఈ రవీందర్ కు ఉద్యోగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రఘునందన్, కో చైర్మన్ పి గంగాధర్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, 1104 జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ జిల్లా కార్యదర్శి గంగారం నాయక్ పాల్గొన్నారు.
