27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రామ గ్రామాన ఎమ్మార్పీయస్ జెండాలను ఎగరేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మండల ఎమ్మార్పీయస్ ప్రెసిడెంట్ శివరాజ్ మాదిగ

 

వేల్పూర్, బతుకమ్మ : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి వార్షికోత్సవం ను పురస్కరించుకొని మండలంలోని గ్రామ గ్రామాన ఎమ్మార్పీయస్ జెండాను ఆవిష్కరించుకోవాలని ఎమ్మార్పీయస్ మండల ప్రెసిడెంట్ తెడ్డు శివరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మోచి సంక్షేమ సంఘం వద్ద జెండా గద్దె నిర్మాణంనకు గాను మండల కమిటీ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ ను సాధించిన సందర్బంగా, 31వ వార్షికోత్సవం సందర్బంగా పండగ వాతావరణంలో గ్రామ గ్రామాన మన సంఘ భవనాల వద్ద జెండా గద్దెలను నిర్మించుకొని,ఎమ్మార్పీయస్ జెండాను ఆవిష్కరించుకోవాలని ఆయన కోరారు. మాదిగ రిజర్వేషన్ ను సాధించి పెట్టిన పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగకు మనమందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లోమాదిగ రిజర్వేమాదిగ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా మోచి సంక్షేమ కార్యదర్శి సుధాకర్, కేతన్, రాహుల్,వంశీ,ఎంఆర్పిఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article