28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం  జిల్లా కలెక్టర్ కామరెడ్డి పట్టణ పరిధిలోని  13వ వార్డు టేక్రీయల్ లో  ఇద్దరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించి ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలు కూడా గౌరవంగా సొంత ఇంటిలో నివసించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గృహనిర్మాణ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యతగా త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకొనేందుకు లబ్ధిదారులకు సహకారం అందించాలని హోసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్, గృహనిర్మాణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Indiramma's houses should be built quickly

More articles

Latest article