24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతిభకు ప్రోత్సాహకాలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన సదామస్తుల రాములు వారి చారిటబుల్ ట్రస్టు ద్వారా షేట్ పల్లీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు  నగదు పారితోషికం ఇవ్వడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. పాఠశాలలో పదవ తరగతి, 9వ తరగతి మొదటి స్థానంలోని విద్యార్థులకు ప్రతినెల రూ.500 విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగినదని అలాగే త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించిన విద్యార్థిని కి ప్రతి నెల వారి యొక్క అకౌంట్ లో అమౌంట్ జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో గురజాల నర్సారెడ్డి, బిల్లాల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article