27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎంపీ అర్వింద్ స్థాయి మరచి మాట్లాడుతుండు

Must read

📰 Generate e-Paper Clip

కేంద్రం నుంచి నిధులు కొచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహిందర్

నిజామాబాద్, బతుకమ్మ :  కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ కృషి చేయాలని రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహిందర్ అన్నారు. రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.  ఎంపీ అర్వింద్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నాడని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కారణం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉద్యమ నాయకుడని.. ఆయన ఉద్యమం చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లో లేడని  విమర్శించారు.  ఎంపీ అర్వింద్ కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ఎంపీ అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ లు తమ రాజకీయ పబ్బం గడుపుకోడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.  తప్పుడు ప్రచారాలు చెయ్యడం బీజేపీ నాయకులకు కొత్తేమి కాదని,  అర్వింద్ కు అబద్దాలు ఆడటం వెన్నెతో పెట్టిన విద్య అని ఆరోపించారు. కార్యక్రమంలో  జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకాష్ , రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ , ప్రధాన కార్యదర్శి భూపతి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article