29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉన్నత విద్యపై పాఠశాల విద్యార్థులకు ప్రేరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థులు శనివారం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం మీకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉన్నత విద్య పై అవగాహన కల్పించారు. జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమంలో ఐదవ రోజు పోచారం గ్రామంలో ఉన్నత విద్యపై విద్యర్థులకు అవగాహస కల్పించారు.  అనంతరం గ్రామంలో రైతులకు మట్టినమూనా సేకరణ, భూసార పరీక్షల ఆవశ్యకత గురించి వివరించారు. ఇందులో భాగంగా విద్యర్థులకు ఉన్నత విద్యా ప్రాముఖ్యత, ఏ పై చదువుల పట్ల సూచనలు, మార్గ దర్శకత్వం, విద్యార్థులకు వారి భవిష్యత్తును మెరుగు పర్చుకోవడానికి అవసరమైన నిర్ణయాలు  తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ సురేందర్, ఎంపీడీవో ప్రభాకర్ చారి, మాజీ సర్పంచ్ విజిత శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తిరుపతి, కార్తీక్, సంతోష్ కుమార్, డాక్టర్ అనిల్ రెడ్డి, డాక్టర్ రేవంత్, డాక్టర్ శివాని, డాక్టర్ ఉపేంద్ర, 127 మంది వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article