- కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.శ్రవణ్ కుమార్
బతుకమ్మ, మాచారెడ్డి: వినియోగదారులకు మరింత చేరువై మెరుగైన స సేవలు అందించడానికి విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 444 ఫిర్యాదులు రాగా 400 ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆయన వివరించారు. వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించడానికి అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ ఆఫీస్ లలో అమలు చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలు ప్రధానంగా విద్యుత్ బిల్లుల సమస్యలు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, క్యాటగిరి మార్పు, పేరు మార్పు ప్రమాద భరింతగా ఉన్న స్థంబాలు తదితర విద్యుత్ ఫిర్యాదుల సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి దోహద పడుతుందని తెలిపారు. అలాగే వారితో సత్ సంబంధాలు మరింత మెరుగు పడుతాయని అన్నారు. ఈకార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కొరకు సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో అనగా సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు మరియు సర్కిల్ ఆఫీస్ లో అదే రోజు సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రజా వాణి కార్యక్రమన్ని పటిష్ట పరిచడంలో భాగంగా సమీక్షలు నిర్వహించి విద్యుత్ వినియోగదారులు చేసే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ ప్రజావాణి వినియోగదారులకు మరింత చేరువై వారితో మమేకమై ఉద్యోగస్తులు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని వివరించారు.
