కోతుల పేరు చెప్పి కోతి చేష్టలు

0 2,717

. హాస్టల్ ఆవరణలో టేకు చెట్ల నరికివేతపై ఫారెస్ట్ అధికారుల సీరియస్

. దుంగలను హాస్టల్ లో దాచి.. మొదళ్లను దహనం చేయించిన వైనం

. వార్డెన్ పై కేసు నమోదు.. ఉన్నతాధికారులకు నివేదిక

కామారెడ్డి, బతుకమ్మ: హాస్టల్ ను తన సొంత ఇంటిలా.. అందులోని విద్యార్థులను తన పిల్లల్లా చూసుకోవాల్సిన వార్డెన్ బాధ్యతలను మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఘటన ఎల్లారెడ్డిలోని ఎస్సీ గర్ట్స్ హాస్టల్ లో రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.

వార్డెన్ శారద తన పై అధికారులు, ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకుండా హాస్టల్ ఆవరణలోని సుమారు 20 టేకు చెట్లను నరికివేయించి దుంగలను హాస్టల్ దాచారు. అంతటితో ఆగకుండా చెట్లు నరికిన తరువాత మొదళ్లను దహనం చేయించారు. విషయం బయటికి పొక్కడంతో ఫారెస్ట్ అధికారులు హాస్టల్ లో విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి దుంగలను సీజ్ చేశారు.

చెట్లు నరికిన తరువాత మొదళ్లను దహనం చేసినట్లు నిర్ధారించారు. ఇదంతా ఎందుకు చేశావమ్మా అని ప్రశ్నిస్తే.. కోతలు వస్తున్నాయి సార్.. అందుకే చెట్లను అడ్డంగా నరికేయించా అని సమాధానం చెప్పడంతో సంక్షేమ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు విస్తుపోయారు. కోతుల పేరు చెప్పి ఇవేం కోతివేషాలంటూ విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం సరఫరా అయ్యే బియ్యాన్ని సైతం వార్డె అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

పలు సెక్షన్ ల కింద కేసు నమోదు


Monkey antics when you say the name of the monkey
హాస్టల్ ఆవరణలో టేకు చెట్లను నరికినట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టి వార్డెన్ పై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. వార్డెన్ నరికివేయించిన టేకు చెట్ల విలువ సుమారు రూ.లక్షా 19వేలు ఉంటుందని ఎఫ్ ఆర్ వో ఓంకార్ నాయక్ తెలిపారు. కేసు వివరాలు, పంచనామా నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై స్పెషల్ అధికారిణి డీఆర్వో అనుంజని, సెక్షన్ ఆఫీసర్ గోపాల్, ఎల్లారెడ్డి డీఆర్వో శ్రీనునాయక్, బీటీ ఆఫీసర్ రాజ్ కుమార్, హరి తదితరులు విచారణ చేపట్టారు. టేకు చెట్లు నరికివేయించిన వార్డెన్ పై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేసినప్పటికీ సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.

Leave A Reply

Your email address will not be published.