25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమిషన్ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అభయ హస్తం కాలనీలో గల నర్మదా బాణ శివాలయంలో మహ్మద్ షబ్బీర్ అలీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం, ప్రతి డివిజన్ కి కోటి రూపాయలు ప్రత్యేక నిధులను కేటాయించి కృషి చేస్తున్నారని, అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంకులు, రోడ్లు డ్రైనేజీ ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ నాయకులు కల్పన, రాములు, మీనా, లలిత, సాయన్న, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article