నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసే సమావేశం సందర్భంగా బందోబస్తును సీపీ సాయిచైతన్య ఆదివారం స్వయంగా పరిశీలించారు. నిజామాబాద్ లో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నెల 16న సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగేలా చూడాలని, కార్పొరేటర్స్, ఇతర అధికారుల ఏర్పాట్లు చేసిన భద్రతను అన్నీ చోట్ల పటిష్ట బందోబస్తూ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు. సీపీ వెంట నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, 4వ టౌన్ ఎస్.హెచ్.ఓ ఎస్. సతీష్ తదితరులున్నారు.
