. . . మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ
నాందేడ్, బతుకమ్మ :
దేశానికి మహోన్నత నేతలైన మహాత్మా జ్యోతిరావు పూలే,బాలగాంగధర్ తిలక్, సా విత్రిబాయి పూలే ,రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, శివాజీ వంటి ఎందరో మహానుభావులను అందించిన మహారాష్ట్ర ప్రజలను ప్రధాని మోడి మోసం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల లో భాగంగా ధర్మాబాద్ లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ , ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ ఘరి, నాందేడ్ ఎంపీ అభ్యర్థి రవీంద్ర వసంత్ రావు చవాన్, నైగావ్ ఎమ్మెల్యే అభ్యర్థి మినల్ నిరంజన్ పాటిల్ లతో కలిసి పాల్గోన్నారు. ఈ సంధర్బంగా షబ్బిర్ ఆలీ మాట్లాడుతు మహరాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని ఆరోపించారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కుడా తమ పార్టిదే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అసత్య ప్రచారం చేస్తుందన్నారు.మహారాష్ట్రలో కూడా గెలిపివ్వండి గ్యారెంటీ అమలు బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారు అన్నారు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువ అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కేంద్ర,మహా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని ప్రధాని మోదీ భావించారని అపార్టి ని ఓడించాలని షబ్బిర్ ఆలీ పిలుపు నిచ్చారు.

