స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరుతూ..
హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం లేఖ రాసింది. తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని లేఖలో కవిత విజ్ఞప్తి చేసింది. ఈ డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తుందని పేర్కొంది.