పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత భరోసా

0 2,040

హైదరాబాద్, బతుకమ్మ :

మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్ ను ఆదివారం  ఎమ్మెల్సీ కవిత కలిశారు. వారిని కలుసుకున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఈ సందర్భంగా వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గతంలో తమ కూమార్తె ప్రియాంక వైద్య విద్య అభ్యసించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసిన పద్మావతి… కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే తరహాలో భవిష్యత్తులోనూ పార్టీ పోలీసు కిష్టయ్య కుటుంబానికి దన్నుగా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా ఉన్నారు .

Leave A Reply

Your email address will not be published.