పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత భరోసా
హైదరాబాద్, బతుకమ్మ : మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్ ను ఆదివారం ఎమ్మెల్సీ కవిత కలిశారు. వారిని కలుసుకున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఈ సందర్భంగా వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గతంలో తమ కూమార్తె ప్రియాంక వైద్య విద్య అభ్యసించడానికి బీఆర్ఎస్...