హైదరాబాద్, బతుకమ్మ : తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం అమెరికాకు ఎమ్మెల్సీ కవిత బయలుదేరి వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 23న తిరిగి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకోన్నారు.
