. . . మరికోద్ధి సేపట్లో ఎమ్మెల్సీ ఓట్ల లేక్కింపు
. . . ఎర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
కరీం నగర్, బతుకమ్మ:
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఫలితాలు మరికోద్ధి సేపట్లో వెలువడనున్నాయి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గత నెల 27న జరిగిన పోలింగ్ లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 56 మంది, టిచర్ ఎమ్మెల్సీ స్థానంకు 15 మంది పోటిలో ఉన్నారు. పట్ట భద్రుల నియోజకవర్గంలో 2,50,328 ఓట్లు పోల్ కాగా , టిచర్ ఓటర్లు 24,968 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ధన ప్రవహం , కార్పోరేట్ శక్తుల పోటిపై ప్రధానంగా జరిగిందనే వాధనలు ఉన్నాయి. సామాన్యులు ఎవ్వరికి ఓటు వేశారు, బిసి వాధం పనిచేసిందా లేదా అనేది కోద్ధి నిమిషాలలో తెలిసిపోనుంది. జాతీయ పార్టిల అభ్యర్ధుల తో పాటు లోకల్ లీడర్ల మధ్య టఫ్ ఫైట్ గా ప్రాధన్యత ఓట్లు నిర్ణయం తెలిపోనుంది….

కరీంనగర్ జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలు కానుండగా, దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు.అత్యంత పటిష్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టనుండగా, ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగనున్నది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా, పూర్తయ్యే సరికి సుదీర్ఘ సమయం తీసుకోనున్న నేపథ్యంలో మూడు షిప్టుల్లో లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారు.

