బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి మహా పడి పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. శబరి అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు బయలుదేరారు. 18 మెట్ల పూజల పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు శబరి అయ్యప్ప స్వామి దర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నారని, అయ్యప్ప స్వాములకు చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కేమ్రాజ్ కలాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, జుక్కల్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సతీష్ పటేల్, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, కౌలాస్ గ్రామ మాజీ సర్పంచ్ గొల్ల హన్మండ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

