– గ్రామపంచాయతీ కార్యాలయంలో కాలనీవాసుల నిరసన…
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని 6 వ వార్డు శ్రీ వీరభద్ర కాలనీ (దుర్కి గల్లీ)లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గత ఐదు రోజులుగా త్రాగునీరు రావడం లేదని, త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా కాలనీలో గత ఐదు రోజుల నుండి త్రాగునీరు రావడం లేదని, త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు.
