హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు.