నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని మాదిగ జాగృతి సంఘం అధ్యర్యంలో గురువారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా.షమీం అక్తార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి కోర్ కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు మహారాజ్, మాదిగ జాగృతి సెంట్రల్ కమిటీ మెంబెర్స్ భాగేంద్ర మహారాజ్, సుదర్శన్, రాజు, గడ్డల రమేష్, గడ్డల సాయినాథ్, సంతోష్ మహారాజ్, సుధాకర్ మహారాజ్, నల్లూరి రాజన్న మహారాజ్, వినోద్ మహారాజ్, వివిధ జిల్లా, మండలాల మాదిగ జాగృతి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

